భారతీ ఎయిర్‌టెల్ నెక్స్ట్రాలో భారీగా పెట్టుబడులు

17581చూసినవారు
భారతీ ఎయిర్‌టెల్ నెక్స్ట్రాలో భారీగా పెట్టుబడులు
భారతీ ఎయిర్‌టెల్ తన డేటా సెంటర్ విభాగమైన 'నెక్స్ట్రా'లో అంతర్జాతీయ సంస్థల నుండి సుమారు 1 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.8,300 కోట్లు) పెట్టుబడులను ఆకర్షించింది. ఆల్ఫా వేవ్ గ్లోబల్, కార్లైల్, యాంకోరేజ్ క్యాపిటల్ ఈ పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ నిధుల సేకరణతో నెక్స్ట్రా సంస్థ విలువ 3.1 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. కృత్రిమ మేధ (AI) ఆధారిత డేటా సెంటర్ల విస్తరణ, దేశీయ డేటా సెంటర్ మార్కెట్‌లో 25 శాతం వాటాను కైవసం చేసుకోవడమే లక్ష్యమని ఎయిర్‌టెల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ గోపాల్ విట్టల్ పేర్కొన్నారు. ప్రస్తుతం 300 మెగావాట్ల సామర్థ్యం ఉండగా, దీన్ని 1 గిగావాట్‌కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్