జగన్‌ను కలిసిన భవానీపురం బాధితులు: అండగా ఉంటానని హామీ

509చూసినవారు
జగన్‌ను కలిసిన భవానీపురం బాధితులు: అండగా ఉంటానని హామీ
విజయవాడలోని జోజినగర్‌లో 42 ఇళ్లను కూల్చివేసిన ఘటనపై బాధితులు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ను శుక్రవారం కలిశారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో కలిసి తమ గోడును చెప్పుకుని వినతి పత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం కోర్టు ఉత్తర్వులను సాకుగా చూపి, సుప్రీం కోర్టులో స్టే ఉన్నప్పటికీ ఆగమేఘాలపై ఇళ్లను నేలమట్టం చేసి పేదల జీవితాలను రోడ్డుపాలు చేసిందని బాధితులు ఆరోపించారు. ఈ వ్యవహారం వెనుక కోట్ల రూపాయలు చేతులు మారాయన్నారు.

సంబంధిత పోస్ట్