AP: విజయవాడలోని భవానీపురం, జోజినగర్ లోని 42 ఫ్లాట్ల బాధితులు సీఎం చంద్రబాబు నివాసం వద్దకు చేరుకుని తమను ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇళ్లను కూలగొట్టారని, ఇప్పుడు రోడ్ల మీదే పడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని బాధితులు వాపోయారు. సీఎంను కలిసే అవకాశం కల్పించాలని పోలీసులను వేడుకున్నారు. తమ ఇళ్ల వద్ద కంటే ఇక్కడే చంద్రబాబు ఇంటి ముందే కూర్చోవడం మేలని బాధితులు పేర్కొన్నారు.