కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులను పరిశీలించారు. టాక్సీవే, రన్‌వే నిర్మాణాలను పర్యవేక్షించి, నీటి నిల్వ సమస్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా అనుకున్న సమయానికి ప్రాజెక్ట్ పూర్తవుతుందని, డిసెంబర్ లేదా జనవరిలో టెస్ట్ ఫ్లైట్ ఎగరబోతోందని మంత్రి తెలిపారు. ఈ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించనున్నట్లు మంత్రి ప్రకటించారు.