శ్రీశైలంలో భ్రమరాంబికాదేవి వార్షిక కుంభోత్సవం

2071చూసినవారు
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవి వార్షిక కుంభోత్సవం
AP: ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో భ్రమరాంబికాదేవి వార్షిక కుంభోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మల్లికార్జున స్వామివారి లింగరూపానికి అన్నాభిషేకం చేసి, పెరుగన్నం, భక్షాలతో కప్పారు. అమ్మవారి ఉగ్రరూపం స్వామివారిపై పడకుండా ఆలయ ద్వారాలు మూసివేశారు. కుంభోత్సవంలో కీలక ఘట్టమైన స్త్రీ వేషధారణలో అమ్మవారికి కుంభహారతినిచ్చారు. రెండో విడత సాత్వికబలిగా గుమ్మడి, టెంకాయ, అన్నం రాసి అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాసరావు, స్థానికులు, భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you