భారతదేశంలో పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపే E20 ఇంధన విధానం అమలులోకి వచ్చినప్పటికీ, పొరుగు దేశం భూటాన్ దీనిని తీసుకోవడానికి నిరాకరించింది. అక్కడి పాత ఇంధన నిల్వ వ్యవస్థ, భూగర్భ ట్యాంకుల్లో నీరు చేరే అవకాశం, తేమను ఇథనాల్ త్వరగా ఆకర్షించడం వంటి కారణాలతో ఇంధన నాణ్యత దెబ్బతింటుందని, ట్యాంకులు, పైప్‌లైన్లలో తుప్పు పట్టే ప్రమాదం ఉందని భూటాన్ అధికారులు తెలిపారు.