భూటాన్ భారత్‌కు షాక్.. E20 పెట్రోల్ సరఫరా నిరాకరణ

3759చూసినవారు
భూటాన్ భారత్‌కు షాక్.. E20 పెట్రోల్ సరఫరా నిరాకరణ
భారత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భూటాన్‌కు ఇథనాల్ మిక్స్ చేసిన E20 పెట్రోల్‌ను సరఫరా చేయాలని ప్రతిపాదించగా, భూటాన్ అధికారులు స్పష్టంగా నిరాకరించారు. తమ దేశంలోని ఇంధన నిల్వ వ్యవస్థలు E20కి అనుకూలంగా లేవని, కొండ ప్రాంతాల్లోని డిపోల్లో తేమ, నీటి లీకేజీని అరికట్టడం కష్టమని, దీనివల్ల ఇంధన నాణ్యత తగ్గి వాహనాల పనితీరుపై ప్రభావం పడే ప్రమాదం ఉందని భూటాన్ తెలిపింది.

సంబంధిత పోస్ట్