‘NEET’ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. కౌన్సెలింగ్ కంప్లీట్ గైడ్‌లైన్స్ విడుదల

15095చూసినవారు
‘NEET’ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. కౌన్సెలింగ్ కంప్లీట్ గైడ్‌లైన్స్ విడుదల
నీట్ యూజీ కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించి మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ (MCC) పూర్తి మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ కోసం కౌన్సెలింగ్‌ను నాలుగు రౌండ్లలో నిర్వహించనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఎంసీసీ అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసుకుని కౌన్సెలింగ్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. అనంతరం తమకు నచ్చిన కాలేజీలు, కోర్సులను ప్రాధాన్యత క్రమంలో ఎంపిక చేసి వెబ్ ఆప్షన్లు లాక్ చేయాలి. ఆలిండియా ర్యాంక్, రిజర్వేషన్, సీట్ల లభ్యత ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. అలాట్‌మెంట్ పొందిన విద్యార్థులు ఒరిజినల్ ధ్రువపత్రాలతో నిర్దేశిత గడువులోగా సంబంధిత కళాశాలలో చేరాలి.

సంబంధిత పోస్ట్