రేషన్‌ కార్డుదారులకు బిగ్‌ అలర్ట్‌.. అక్టోబర్‌ 30 వరకే ఛాన్స్‌

22020చూసినవారు
రేషన్‌ కార్డుదారులకు బిగ్‌ అలర్ట్‌.. అక్టోబర్‌ 30 వరకే ఛాన్స్‌
AP: కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కార్డుల్లో పేర్లు, వివరాలు తప్పుగా రావడంతో కొందరు లబ్ధిదారులు అందోళనకు గురయ్యారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి రావడంతో అప్రమత్తమైంది. వివరాలు తప్పుగా వచ్చిన వారికి.. దరఖాస్తు చేసుకుని సవరణ చేయించుకునే ఛాన్స్ కల్పించింది. కార్డు యజమానులు సంబంధిత సచివాలయాల్లోకి వెళ్లి అక్కడ అధికారులకు ఫిర్యాదులు చేయవచ్చని తెలిపింది. అయితే దీనికి అక్టోబర్ 30వ తేదీ వరకు మాత్రమే గడువు విధించింది.

సంబంధిత పోస్ట్