AP: ద్రోణి ప్రభావంతో ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో 2 రోజులపాటు పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని APSDMA తెలిపింది. గురువారం అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు చెట్ల కింద నిలబడరాదని, అప్రమత్తంగా ఉండాలని సూచించింది.