ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ పై సామాన్య, మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు, వ్యాపార వర్గాలు భారీ అంచనాలు పెట్టుకున్నాయి. ముఖ్యంగా, పీఎఫ్ విత్ డ్రాలపై పన్ను మినహాయింపు పరిమితిని రూ.2.65 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంచే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అలాగే, పీఎఫ్ విత్ డ్రాలపై పన్ను మినహాయింపు గడువును ఐదేళ్ల నుండి మూడేళ్లకు తగ్గించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ బడ్జెట్‌లో ఈ అంశాలపై కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది.