AP: వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఎం చంద్రబాబు నాయుడుపై నమోదైన లిక్కర్ కేసులో ఆయనకు భారీ ఊరట లభించింది. ఈ కేసులో దర్యాప్తును ముగిస్తున్నట్లు సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు దానిని విచారణకు స్వీకరించి, కేసును ముగిస్తున్నట్లు పేర్కొంది. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారనే ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. సుదీర్ఘ విచారణ, వాదనల తర్వాత ఏసీబీ కోర్టు ఈ కేసును ముగించింది.