రుణాలు పొందిన వారికి బిగ్ రిలీఫ్.. పూర్తిగా వడ్డీ మాఫీ

45చూసినవారు
రుణాలు పొందిన వారికి బిగ్ రిలీఫ్.. పూర్తిగా వడ్డీ మాఫీ
AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎన్ఎఫ్‌సీడీ, జాతీయ సఫాయి కర్మచారీ ఆర్థికాభివృద్ధి కార్పొరేషన్ సహాయంతో 2014-19 మధ్యకాలంలో రుణాలు పొందిన వారికి 100 శాతం వడ్డీ మాఫీ చేసింది. అయితే దీనికి ఓ చిన్న కండీషన్ పెట్టింది. 2026 ఏప్రిల్ నెలాఖరులోపు పూర్తి రుణం చెల్లించిన వారికి మాత్రమే వడ్డీ రాయితీ అందించనుంది. రుణగ్రహీతలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్