AP: కొనసీమ జిల్లాలో న్యూఇయర్ వేళ మద్యం వ్యాపారులు ఫుల్ బాటిల్‌పై రూ.50 పెంచారు. ప్రభుత్వ అనుమతి లేకుండా రేట్లు పెంచడంపై మందుబాబులు మండిపడుతూ, ఎక్సైజ్ శాఖ చర్య
లు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31, జనవరి 1న మద్యం దుకాణాలను రాత్రి 12 గంటల వరకు నడుపుకోవడానికి ప్రభుత్వం అనుమతి జారీ చేసింది. ఈ నిబంధనలు వైన్ షాపులు, బార్లు, ఇన్ హోస్ లైసెన్సులు, పర్మిట్ రూమ్ లైసెన్సులకు వర్తిస్తాయి.