AP: అనకాపల్లి జిల్లాలో వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. సబ్బవరంలో మాజీ సర్పంచ్ బోకం సూర్యనాయుడు, ఎంపీటీసీ బోకం గోపాలకృష్ణతో పాటు 200 మంది అనుచరులు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.
టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబు, ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ గండి బాబ్జి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
టీడీపీ అభివృద్ధి, సంక్షేమ పాలనకు ఆకర్షితులై చేరామని కొత్తగా చేరిన నాయకులు తెలిపారు.