AP: మాజీ సీఎం,
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు బిగ్ షాక్ తగిలింది. వారి కుటుంబానికి చెందిన సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్న 24.84 ఎకరాల అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం రద్దు చేసింది. పల్నాడు జిల్లా కలెక్టర్ నివేదిక ఆధారంగా మాచవరం మండలం వేమవరంలో 20 ఎకరాలు, పిన్నెల్లి గ్రామంలో 4.84 ఎకరాలకు సంబంధించిన దస్తావేజులను స్థానిక తహసీల్దార్ తక్షణమే రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.