AP: నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 26, 38వ డివిజన్లకు చెందిన F YCP నాయకులు, వందలాదిమంది కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రూరల్ టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో వీరంతా తెలుగుదేశం పార్టీలో చేరారు. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో, YCP నెల్లూరు రూరల్ ఎంప్లాయిస్ & పెన్షన్స్ వింగ్ అధ్యక్షులు కనకట్ల మోహన్ రావు, నాయకుడు సందాని బాషా ఆధ్వర్యంలో చేరికలు జరిగాయి.