AP: ఏలూరు జిల్లాలో పెద్దపులి సంచారం స్థానిక ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తోంది. బుధవారం తెల్లవారుజామున వేలేరుపాడు మండలంలోని చింతలపాడు గ్రామ సమీపంలో పెద్దపులి ఓ ఆవుపై దాడి చేసి చంపింది. ఈ ఘటనతో గ్రామస్థులు అప్రమత్తమయ్యారు. అటవీ శాఖ అధికారులు పులి కదలికలను నిశితంగా పరిశీలిస్తూ, రేడియో కాలర్ ద్వారా దానిని ట్రాక్ చేస్తున్నారు. ప్రస్తుతం పులి యడవల్లి అటవీ ప్రాంతం వైపు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు.