బిగ్‌బాస్ షోలో పాల్గొన్నవారు ఒక్కసారిగా సెలబ్రిటీలు అవుతారని, కానీ ఆ ఫేమ్ కొద్దికాలమే ఉంటుందని, దానివల్ల అవకాశాలు అంతంతమాత్రమే వస్తాయని నటి ఆర్జే కాజల్ అన్నారు. తెలుగు బిగ్‌బాస్ ఐదో సీజన్‌లో పాల్గొన్న ఆమె, బిగ్‌బాస్ తర్వాత చాలామందికి అవకాశాలు రాక ఇబ్బందులు పడుతున్నారని, కొందరు ప్రధాన పాత్రల కోసం జీవితాంతం ఎదురుచూస్తూనే ఉంటారని, మరికొందరు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లుగా మారిపోతారని తెలిపారు. ఫేమ్ ఒక్కటే కెరీర్‌ను నిర్మించదని, బిగ్‌బాస్ వల్ల ఏదీ మారిపోదని ఆమె పేర్కొన్నారు.