కారును ఢీకొట్టిన బైక్.. ఇద్దరు మృతి (వీడియో)

17891చూసినవారు
AP: విశాఖ జిల్లా భీమిలి మండలం తిమ్మాపురం వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి కారును ఢీకొట్టి, ఆపై రోడ్డు దాటుతున్న మహిళపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో విజయనగరం జిల్లా జామి మండలానికి చెందిన గ్రంధి సూరి స్పాట్‌లోనే మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన తిమ్మాపురానికి చెందిన కృష్ణవేణి (43) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్