AP: శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలో విషాద ఘటన జరిగింది. విజయనగరం జిల్లా గజపతికి చెందిన జి. శివాజీ (25) భారత్ గ్యాస్ మెకానికల్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి విధులు ముగించుకుని ఇంటికి బైక్‌పై వెళ్తుండగా.. విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.