AP: విజయనగరం జిల్లా భోగాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీని వెనుకనుంచి బైక్ ఢీకొట్టడంతో ముగ్గురు శ్రీకాకుళం వాసులు స్పాట్‌లోనే మృతి చెందారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగంగా వాహనాలు నడపరాదని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, డ్రైవింగ్ సమయంలో హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు సూచించారు.