AP: విశాఖపట్నంలో కొత్తపాలెం-నరవ మార్గంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపుతప్పి గోడను ఢీకొన్న బైక్ కారణంగా క్రాంతి (22) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సమచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.