వేగంగా వచ్చి బాలుడిని ఢీకొట్టిన బైకర్(వీడియో)

5743చూసినవారు
మహారాష్ట్ర లాతూర్ నగరంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆనంద్ నగర్ ఏరియాలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ బాలుడిని వెనుక నుంచి అతివేగంగా వచ్చిన బైక్ ఢీకొట్టింది. దీంతో బాలుడు ఎగిరిపడ్డాడు. ఈ ప్రమాదంలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. బైక్ నడుపుతున్న వ్యక్తి ఉద్దేశపూర్వకంగానే బాలుడిని ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాద దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్