మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఫిబ్రవరి 18న అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడును కలవనున్నారు. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, విద్య రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం అమలుపై చర్చలు జరగనున్నాయి. ప్రజలకు వేగంగా సేవలు అందించడానికి సాంకేతికతను ఉపయోగించడం ఈ ఒప్పందం లక్ష్యం.