AP: అసెంబ్లీలో 'ఏపీ పబ్లిక్ సర్వీసు నియామకాల బిల్లు' సవరణపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రసంగం చేశారు. రాజకీయ హత్యలకు గురైన కుటుంబాలను ఆదుకోవాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఈ బిల్లు, గతంలో ఎదురైన అడ్డంకులను అధిగమించి మళ్లీ సభ ముందుకు వచ్చింది. మంత్రి లోకేష్ మాట్లాడుతూ, "2025 సెప్టెంబర్ 27న ఈ బిల్లును అసెంబ్లీ ఆమోదించి మండలికి పంపించాం. కానీ అక్కడ 100 రోజులు దాటినా ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో, నిబంధనల ప్రకారం మళ్లీ ఈ బిల్లు అసెంబ్లీకి వచ్చింది. మండలి తిరస్కరించినా, పక్కన పెట్టినా సభలో మళ్లీ ఆమోదించుకునే అధికారం మనకు ఉంది" అని స్పష్టం చేశారు.