బయో ప్యాకథాన్ 2026: రూ.10లక్షలు గెలుచుకోండి!

7130చూసినవారు
బయో ప్యాకథాన్ 2026: రూ.10లక్షలు గెలుచుకోండి!
ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 'బయో ప్యాకథాన్ 2026'ను నిర్వహిస్తోంది. భూమిలో కరిగిపోయే ప్లాస్టిక్ ప్యాకేజింగ్ కోసం వినూత్న ఆలోచనలు అందించేవారికి భారీ బహుమతులు అందించబడతాయి. మొదటి బహుమతిగా రూ.10 లక్షలు, రెండో బహుమతిగా రూ.7 లక్షలు, మూడో స్థానంలో నిలిచిన వారికి రూ.5 లక్షలు లభిస్తాయి. విజేతలకు నగదుతో పాటు పరిశ్రమలతో కలిసి పనిచేసే అవకాశం కూడా దక్కుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 24, 2026 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్