బర్త్ డే స్పెషల్.. నేను రెడీ నుంచి బ్రహ్మానందం పోస్టర్ రిలీజ్

4648చూసినవారు
బర్త్ డే స్పెషల్.. నేను రెడీ నుంచి బ్రహ్మానందం పోస్టర్ రిలీజ్
‘ధమాకా’ దర్శకుడు త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో హవీష్ హీరోగా, నిఖిల కోనేరు నిర్మిస్తున్న చిత్రం ‘నేను రెడీ’. ఈ సినిమా టీజర్ ఆంధ్రా అబ్బాయికి, తెలంగాణ అమ్మాయితో నిశ్చితార్థం, వారి మధ్య సాంస్కృతిక, జీవనశైలి సంఘర్షణ నేపథ్యంలో హాస్యభరిత కథాంశంతో ఆకట్టుకుంది. కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ‘నేను రెడీ’ నుంచి బ్రహ్మానందం స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేస్తూ, ‘పెద్ద తెరపై హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ట్రేడ్‌మార్క్ హాస్యాన్ని చూడటానికి సిద్ధంగా ఉండండి’ అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్