టీలో బిస్కెట్లు ముంచుకొని తింటున్నారా..?

6128చూసినవారు
టీలో బిస్కెట్లు ముంచుకొని తింటున్నారా..?
టీతో పాటు మైదా బిస్కెట్లు, పఫ్స్ తీసుకోవడం వల్ల గ్యాస్, గుండెల్లో మంట వస్తుందని, ట్రాన్స్ ఫ్యాట్స్, చక్కెర వల్ల ఊబకాయం, మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టీలో ఎక్కువ చక్కెర వేసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగి కాలేయంలో కొవ్వు చేరుతుంది. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల ఎసిడిటీ, రాత్రి తాగితే నిద్రలేమి సమస్యలు వస్తాయి. గ్రీన్ టీ అతిగా తాగితే రక్తహీనత, ఎముకలు బలహీనపడతాయి. మరీ వేడి టీ తాగడం వల్ల అన్నవాహిక దెబ్బతింటుంది. టీ తాగిన తర్వాత అసౌకర్యాలుంటే వారం పాటు టీకి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్