రాజధాని అమరావతిలో బిట్స్ పిలానీ విద్యా సంస్థ క్యాంపస్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. దీని కోసం తుళ్లూరు మండలంలోని మందడం, వెంకటపాలెం గ్రామాల్లో 70 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు బిట్స్ ప్రతినిధులు సీఆర్‌డీఏతో భూ విక్రయ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంపై సీఆర్‌డీఏ తరపున జాయింట్ డైరెక్టర్ వి.డేవిడ్ రాజు, బిట్స్ తరపున డిప్యూటీ రిజిస్ట్రార్ వి.వి.ఎస్.ఎన్. మూర్తి సంతకాలు చేశారు.