టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీకి చేదు అనుభవం (వీడియో)

0చూసినవారు
AP: అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు చేదు అనుభవం ఎదురైంది. మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే, ఎంపీని సీపీఎం నేతలు అడ్డుకున్నారు. అనంతపురంలో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని, అలాగే డంపింగ్ యార్డ్‌ను తరలించాలని డిమాండ్ చేశారు. సమస్యను త్వరలో పరిష్కరిస్తామని ఎమ్మెల్యే, ఎంపీ చెప్పినప్పటికీ సీపీఎం నేతలు వినలేదు. వెంటనే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్