AP: అనంతపురం జిల్లా శింగనమల మండలం నాగులగుడ్డం గ్రామంలో పింఛన్లు పంపిణీ చేయడానికి వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణికి చేదు అనుభవం ఎదురైంది. రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణం ఎప్పుడు చేస్తారని స్థానికులు ఎమ్మెల్యేను నిలదీసి, ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు ఎందుకు పరిష్కరించలేదని ప్రజలు ప్రశ్నించారు. ఒక యువకుడు అధికారులను లోపలికి రానివ్వడం లేదని అనడంతో ఎమ్మెల్యే అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.