AP: CM చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో బీజేపీ చీఫ్ మాధవ్ గురువారం సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో తిరుమల లడ్డు అంశంపై భవిష్యత్ కార్యాచరణతో పాటు, మూడు పార్టీలు కలిసి ముందుకు వెళ్లడంపై చర్చించనున్నారు. నామినేటెడ్ పదవులు, ఇతర కీలక అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వ కార్యకలాపాలు, కూటమి బలోపేతంపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.