AP: పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన బీజేపీ నేత ద్వారపురెడ్డి శ్రీనివాసరావుకు ఆదివారం పెను ప్రమాదం తప్పింది. తోటపల్లి దేవస్థానం సమీపంలోని కోదండరామ స్వామి ఆలయం వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో శ్రీనివాసరావు సురక్షితంగా బయటపడటంతో పార్టీ నేతలు ఊపిరిపీల్చుకున్నారు. అయితే కారు మాత్రం నుజ్జునుజ్జు అయినట్లు తెలుస్తోంది. ప్రమాదం అనంతరం శ్రీనివాసరావు క్షేమంగా ఇంటికి చేసుకున్నట్లు సమాచారం .