కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పలు ప్రాజెక్టులపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. గూగుల్ డేటా సెంటర్ల వల్ల లక్షల్లో ఉద్యోగాలు రాబోవని, రుషికొండను ఆధ్యాత్మిక అవసరాలకు కేటాయించాలని, భోగాపురం విమానాశ్రయం నిర్మాణంలో బీజేపీ పాత్రను విస్మరించారని ఆయన ప్రశ్నించారు. విశాఖ ఎయిర్‌పోర్ట్‌ను మూసివేయడానికి కూడా తాను వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. దాంతో బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు కూటమికి ఇబ్బందికరంగా మారాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.