మాజీ ప్రధాని వాజ్ పేయీ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా.. బీజేపీ గురువారం నుంచి 'అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర'ను రాయలసీమలోని ధర్మవరం నుంచి ప్రారంభించనుంది. ఈ యాత్ర ద్వారా మోదీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు నాయకులు వివరిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించిన అనంతరం, ఈ నెల 25న అమరావతిలో జరిగే ముగింపు సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ పాల్గొంటారు.