అనకాపల్లి ఎంపీ తీరుపై బీజేపీలో అసంతృప్తి!

275చూసినవారు
అనకాపల్లి ఎంపీ తీరుపై బీజేపీలో అసంతృప్తి!
AP: ఉమ్మడి విశాఖపట్నంలోని అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తీరుపై పార్టీలో అసంతృప్తి నెలకొంది. సొంత పార్టీ నాయకుల కంటే ఇతర పార్టీ నాయకులకు ఆయన అందుబాటులో ఉంటున్నారని, నియోజకవర్గంలో సమాచారం కూడా తమకంటే ముందు వారికి చెబుతున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. సీఎం రమేష్ తమను కలుపుకొని పోవడం లేదని, వచ్చే ఎన్నికల్లో ఆయన ఒంటరి పోరాటం చేయాల్సి వస్తుందని కొందరు సూచిస్తున్నారు. అయితే, సీఎం రమేష్ తాను కార్యాలయం ఏర్పాటు చేశానని, సమస్యలు చెప్పుకోవచ్చని, అన్నీ తానే చూడలేనని వాదిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్