AP: కర్నూలు జిల్లా, ఆదోనిలో
బీజేపీ కార్యకర్త కల్లుబోతుల సురేశ్, 4 లక్షల రూపాయల బకాయి చెల్లిస్తానని పిలిచి ఇద్దరు సోదరులపై దాడికి పాల్పడ్డాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా తమను పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పీజీఆర్ఎస్ ద్వారా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితులు, సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గతంలో సచివాలయ ఉద్యోగిపై దాడి చేసిన సురేశ్ వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే.