ఎర్ర టమాటాల కంటే ఎక్కువ పోషకాలున్న నల్ల టమాటాలు రష్యా, ఉక్రెయిన్ ప్రాంతాల నుంచి వచ్చాయి. వీటిలో లైకోపీన్‌తో పాటు ఆంతోసైనిన్స్ అనే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్, గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి వ్యాధుల నుంచి రక్షిస్తాయి. అలాగే వీటిలోని విటమిన్ A, C, K, పొటాషియం, మాంగనీస్ వంటి ఖనిజాలు రోగనిరోధక శక్తిని పెంచి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రుచిలోనూ ఇవి తియ్యగా, స్మోకీ ఫ్లేవర్‌తో ఉంటాయి. హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో వీటి సాగు పెరుగుతోంది.