తల్లీ, ముగ్గురు పిల్లల్ని కాపాడిన బ్లూకోల్ట్స్‌ సిబ్బంది

47చూసినవారు
తల్లీ, ముగ్గురు పిల్లల్ని కాపాడిన బ్లూకోల్ట్స్‌ సిబ్బంది
AP: భర్త వేధింపులు భరించలేక, తన ముగ్గురు పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన ఓ మహిళను YSR కడప బ్లూకోల్ట్స్‌ సిబ్బంది కాపాడారు. మంగళవారం కడప-తిరుపతి రైల్వే మార్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చెన్నూరు మండలం శాటిలైట్‌ సిటీకి చెందిన ఈ మహిళ, తన 11, 10, 8 ఏళ్ల పిల్లలతో కలిసి పట్టాలపై నిలబడగా, డయల్‌ 112 ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సకాలంలో స్పందించి వారిని రక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్