AP: కోనసీమ జిల్లాలోని రాజోలులో జరిగిన పల్లె పండుగ 2.0లో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ నేతలు బూతులు, బుద్ధి మారడం లేదని, ఇలాగే వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఎవరు ఏం మాట్లాడుతున్నారో నిశితంగా గమనిస్తున్నామని, వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చే ఆశలు పెట్టుకోవద్దని స్పష్టం చేశారు.