బోట్ల తరలింపుతో నాకు సంబంధం లేద: బీద మస్తాన్ రావు

3801చూసినవారు
బోట్ల తరలింపుతో నాకు సంబంధం లేద: బీద మస్తాన్ రావు
AP: పాండిచ్చేరి బోట్ల తరలింపు వ్యవహారంలో తనపై వస్తున్న ఆరోపణలపై రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు స్పందించారు. శ్రీరామచంద్రుడి సాక్షిగా బోట్ల తరలింపుతో తనకు సంబంధం లేదని, దోషులను తేల్చాలని కేంద్ర బృందాలను కోరానని తెలిపారు. తనపై ఆరోపణలు నిజమైతే రాజ్యసభ సభ్యత్వంతో పాటు రాజకీయాల నుంచి నిష్క్రమిస్తానని ఆవేదన వ్యక్తం చేశారు. బోట్ల చోరీపై దర్యాప్తు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ, స్థానికుల సహకారం లేకుండా చోరీ అసాధ్యమన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్