AP: సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఆ
రుగురు మత్స్యకారులు గల్లంతైన విషయం తెలిసిందే. రేవుపోలవ
రం సముద్ర తీరంలో సోమవారం ఉదయం గల్లంతైన ఓ మత్స్యకారుడి మృతదేహం కొట్టుకొచ్చింది. మృతుడు ఎస్.రాయవరం మండలం బంగారమ్మపాలేనికి చెందిన చోడిపల్లి సింహాద్రిగా గుర్తించారు. మత్స్యకారుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక కొడుకు ఉన్నారు.