AP: కృష్ణా జిల్లా, పెనమలూరు వంతెన సమీపంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని బయటకు తీసేందుకు కాలువలోకి దిగిన నూకరాజు అనే యువకుడు నీటిలో గల్లంతయ్యాడు. గల్లంతైన యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.