విశాఖ బీచ్‌లో యువకుడి మృతదేహం లభ్యం

31చూసినవారు
విశాఖ బీచ్‌లో యువకుడి మృతదేహం లభ్యం
AP: విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో సుప్రీం హోటల్ ఎదురుగా ఎం.శ్రీధర్ (36) అనే యువకుడి మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభ్యమైంది. కార్ మెకానిక్‌గా పనిచేస్తున్న శ్రీధర్.. సోమవారం రాత్రి బీచ్‌లో రాళ్ల మధ్య పడి ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. త్రీ టౌన్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు జగదాంబ సమీపంలో నివాసం ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్