15 ఏళ్ల డాలర్ పెగ్ విధానాన్ని బొలీవియా రద్దు చేసింది. విదేశీ మారక నిల్వలు తగ్గడం, డాలర్ల కొరత, బ్లాక్ మార్కెట్ పెరగడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై బొలీవియానో విలువ మార్కెట్ డిమాండ్, సరఫరా ఆధారంగా నిర్ణయిస్తారు. ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం, బొలివియానో విలువ పడిపోయి, ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. అయితే, దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థ పారదర్శకంగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో అర్జెంటీనా, కజకిస్తాన్, ఈజిప్ట్ వంటి దేశాలు కూడా ఇలాంటి విధానాలను మార్చుకున్నాయి. సౌదీ అరేబియా, యూఏఈ, హాంకాంగ్ వంటి దేశాలు ఇప్పటికీ డాలర్ పెగ్ విధానాన్ని కొనసాగిస్తున్నాయి.