బాలీవుడ్ నటి జరీన్ ఖాన్ తల్లి పర్వీన్ ఖాన్ బుధవారం (ఏప్రిల్ 8) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2016లో గుండె శస్త్రచికిత్స అనంతరం ఆరోగ్యం క్షీణించడంతో ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ వార్త సినీ పరిశ్రమలో విషాదాన్ని నింపింది.