హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపింది. జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ నుండి వస్తున్న లుఫ్తాన్స విమానానికి గుర్తుతెలియని వ్యక్తులు ఈ మెయిల్ పంపారు. విమానంలో మానవరహిత బాంబు ఉందని, ల్యాండ్ అయ్యేలోపే పేలిపోతుందని మెయిల్‌లో పేర్కొన్నారు. ఈ సమాచారంతో విమానాశ్రయ భద్రతా సిబ్బంది, అధికారులు అప్రమత్తమయ్యారు.