AP: విజయవాడ సెంట్రల్
టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా అసంతృప్తిలో ఉన్నారా? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటింది. తనకు మంత్రి పదవి రాకపోవడంపై ఆయన బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన దాదాపు 15 మందికి మంత్రి పదవులు ఇచ్చారని, పార్టీలో ఎప్పటి నుంచో కష్టపడిన తనకు మంత్రి పదవి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా చర్చకు దారి తీశాయి. బోండా ఉమా టీడీపీకి రాజీనామా చేసి పార్టీకి షాక్ ఏమైనా ఇవ్వనున్నారా? అని ప్రచారం జరుగుతోంది.