ప్రస్తుత కాలంలో పని ఒత్తిడి, జీవితంలోని చిరాకుల వల్ల వచ్చే కోపాన్ని తగ్గించుకోవడానికి యువత వెంటనే ట్రిప్స్ బుక్ చేసుకుంటున్నారు. దీనినే 'రేజ్ బుకింగ్' అంటారు. జెన్-జీ, మిలీనియల్స్ ఈ ట్రెండ్‌ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. వర్క్-లైఫ్ బ్యాలెన్స్ దెబ్బతినడం, మానసిక ఆందోళన తగ్గించుకోవడానికి ప్రయాణమే ఉత్తమ మార్గమని వారు భావిస్తున్నారు. అయితే, కోపంలో తీసుకునే ఈ నిర్ణయాలు ఆర్థిక ఇబ్బందులకు దారితీయవచ్చని, బడ్జెట్‌కు మించిన ట్రిప్స్ బుక్ చేసుకోకుండా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు.